Telangana

రామ్‌ తాళ్లూరికి జనసేన శ్రేణుల జన్మదినాభినందనలు

రామ్‌ తాళ్లూరికి జనసేన శ్రేణుల జన్మదినాభినందనలు
  • నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపిన ముమ్మారెడ్డి ప్రేమ్‌కుమార్‌
  • పాల్గొన్న కూకట్‌పల్లి నియోజకవర్గ జనసేన నాయకులు
  • రామ్‌ తాళ్లూరిపై అభిమానాన్ని చాటుకున్న పార్టీ శ్రేణులు
సామాన్యుడి అస్త్రం / కూకట్‌పల్లి : జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్‌ తాళ్లూరి జన్మదిన వేడుకలు శనివారం ఆత్మీయ వాతావరణంలో జరిగాయి. ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని జనసేన పార్టీ రాష్ట్ర జాయినింగ్‌ కమిటీ కన్వీనర్‌ ముమ్మారెడ్డి ప్రేమ్‌కుమార్‌, కూకట్‌పల్లి నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులతో కలిసి రామ్‌ తాళ్లూరి నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనను ఘనంగా సత్కరించి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
పార్టీ ప్రధాన కార్యదర్శిగా జనసేన బలోపేతానికి రామ్‌ తాళ్లూరి చేస్తున్న సేవలను నాయకులు అభినందించారు. ఆయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, ప్రజా జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. నాయకులు, కార్యకర్తల మధ్య జరిగిన ఈ ఆత్మీయ కలయికతో ఆయన నివాసం సందడిగా మారింది.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కొల్లా శంకర్‌, వేముల మహేష్‌, శ్రీనివాస గోవింద, ముంతాజ్‌, సృజనతోపాటు పలువురు ముఖ్య నాయకులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రామ్‌ తాళ్లూరికి పుష్పగుచ్ఛాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Related News సంబంధిత వార్తలు

Advertisement 728 x 90 Banner Placehoder