ASTHRAM DAILY
Telangana

ఆదివాసీ హక్కుల కోసం పోరాడాలి.. భీమ్ స్ఫూర్తితో ముందుకు సాగాలి!

ఆదివాసీ హక్కుల కోసం పోరాడాలి.. భీమ్ స్ఫూర్తితో ముందుకు సాగాలి!

సామాన్యుడి అస్త్రం / తెలంగాణ: ఆదివాసీల హక్కుల పరిరక్షణ కోసం పోరాడిన విప్లవ వీరుడు కొమురం భీమ్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యుడు చిరాగ్ ప్రజీత్ గౌడ్ పిలుపునిచ్చారు. కొమురం భీమ్ జయంతి వేడుకలను గురువారం తెలంగాణలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భీమ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా చిరాగ్ ప్రజీత్ గౌడ్ మాట్లాడుతూ.. చరిత్రను పుస్తకాల్లో చదివి మర్చిపోవడం కాకుండా, అందులోని పోరాట స్ఫూర్తిని ఆచరణలో చూపాలని అన్నారు. కొమురం భీమ్ చరిత్రలో ఒక అధ్యాయానికి మాత్రమే పరిమితం కాదని, సమాజంలో అన్యాయం ఉన్నంతకాలం దాన్ని ప్రశ్నించే చైతన్యానికి ఆయన స్ఫూర్తిగా నిలుస్తారని పేర్కొన్నారు. అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

ముఖ్యాంశాలు

  • జనసేన తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో కొమురం భీమ్ జయంతి వేడుకలు.
  • భీమ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన చిరాగ్ ప్రజీత్ గౌడ్.
  • అణగారిన వర్గాల హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపు.

ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మహేష్ వేముల, కేశవ్, యశ్వంత్, రాజు, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Related News సంబంధిత వార్తలు

Advertisement 728 x 90 Banner Placehoder